VIDEO: 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

VIDEO: 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

JN: తరిగొప్పుల మండల కేంద్రంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన సమాచారం మేరకు ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ. 1.22 లక్షలు ఉంటుందన్నారు. వెంకటేష్, చెన్నూరి సుధాకర్‌లపై కేసు నమోదు చేసిన్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.