పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్ధార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ సోమవారం పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పాపన్న చరిత్రను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.