మండలంలో137 స్పౌజ్ పెన్షన్లు మంజూరు

మండలంలో137 స్పౌజ్ పెన్షన్లు మంజూరు

మన్యం: వీరఘట్టం మండలానికి 137 స్పౌజ్ పెన్షన్లు మంజూరైనట్లు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. ఇప్పటి వరకు 9,570 పెన్షన్లు ఉండగా, స్పౌజ్ పెన్షన్లతో కలిపి 9,707 అయినట్లు వెల్లడించారు. శుక్రవారం పెన్షన్ల పంపిణీలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు 80% పూర్తయిందన్నారు. రేపటికల్లా శతశాతం పంపిణీ పూర్తి చేస్తామన్నారు.