అత్తా-కోడళ్ల పోటీ.. కోడలిదే పైచేయి

అత్తా-కోడళ్ల పోటీ.. కోడలిదే పైచేయి

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో బంధుత్వాలను పక్కన పెట్టి సాగిన పోరులో మేనకోడలు పైచేయి సాధించారు. 4వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కట్టా సింధుజ, తన స్వయానా మేనత్త, బీఆర్ఎస్ అభ్యర్థి జీళ్ల శ్రీదేవిపై 182 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఎన్నికలు వేరు, బంధుత్వాలు వేరని ప్రజలు నిరూపించారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.