VIDEO: నూతన ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే
E.G: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి SNR కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయుల అభినందన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 89 మంది నూతన ఉపాధ్యాయులను సత్కరించారు.