వట్టిపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ
SDPT: వట్టిపల్లిలో '99 రోజుల ప్రణాళిక'లో భాగంగా సర్పంచ్ విద్యాధర్, ఉపసర్పంచ్ నాగరాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్లపై అతివేగంతో వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.