రూ.20 బాటిల్‌కు రూ.100కి విక్రయిస్తారా?: హైకోర్టు

రూ.20 బాటిల్‌కు రూ.100కి విక్రయిస్తారా?: హైకోర్టు

రెస్టారెంట్లలో MRP కంటే ఎక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అమ్మడంపై ఢిల్లీ హైకోర్టు జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 బాటిల్‌కు రూ.100 వసూలు చేసి, మళ్లీ సర్వీస్ ఛార్జీలు ఎందుకు విధిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటూ మార్చిలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసోసియేషన్ సవాలు చేసింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.