ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలి: సీఐ

ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలి: సీఐ

SRD: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని సంగారెడ్డి పట్టణ సీఐ రామునాయుడు అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలు వాహనాలు నడపవద్దని సూచించారు.