పెద్ద పులి అడుగులు... భయపడుతున్న ప్రజలు

MLG: పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతుంది. ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి అడుగులను గ్రామస్తుల గుర్తించారు. రామప్ప వాన గుట్టవద్ద పులి అరుపులు వినిపించాయని గొర్రెల కాపలాదారుడు తెలపగా, అటవీ అధికారులు వానగుట్ట ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. రామప్ప వానగుట్ట నుంచి ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతం మీదుగా పులి మేడారం వైపు వెళ్తుండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.