వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

కృష్ణా: గన్నవరం TDP కార్యాలయం దాడి కేసులో వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.