'ఆ ఐదు మండలాలకు రెడ్ అలర్ట్'

'ఆ ఐదు మండలాలకు రెడ్ అలర్ట్'

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఐదు మండలాలకు వాతావరణ శాఖ శనివారం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జిల్లాలోని నర్సాపూర్ జి, భైంసా, దస్తురాబాద్, కుబీర్, కుంటాల మండలాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందని, రాబోయే రెండు రోజులు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్ళవద్దని సూచించారు.