రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NLG: ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం మిర్యాలగూడలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని కలెక్టర్ తెలిపారు.