రెండో విడత సర్పంచ్‌లకు మంత్రి సన్మానం

రెండో విడత సర్పంచ్‌లకు మంత్రి సన్మానం

ములుగు: జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌లను మంత్రి సీతక్క సన్మానించారు. ములుగులోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాలకు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, కార్యకర్తలు తరలివచ్చారు. అందరిని మంత్రి అభినందించారు. డీసీసీ ప్రెసిడెంట్ అశోక్, గ్రంథాలయ ఛైర్మన్ రవి చందర్ పాల్గొన్నారు.