'అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం'
SS: పుట్టపర్తి పురపాలక సంఘం పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు, ప్లాన్‌కు విరుద్ధంగా కట్టిన కట్టడాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం BPS (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) 2025ను ప్రవేశపెట్టింది. 01.01.1985 నుంచి 31.08.2025 మధ్య నిర్మించిన వాటికి ఈ అవకాశం ఉంది. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ క్రాంతి సూచించారు.