ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పులి శ్రీకాంత్, సిపిఐ నాయకులుగురవయ్య, గుమ్మడిబాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.