గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

NGKL: కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలోని పాత గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పూర్తిగా కూల్చివేసి నేలపై పడేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్‌లు సత్యం, శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.