భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

E.G: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతానగరం మండలం రఘుదేవపురంలో కోట నూకరాజు (68) భార్య సుబ్బలక్ష్మిని కత్తితో పీక కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నూకరాజు అదే కత్తితో పీక కోసున్నాడు. 20 రోజుల క్రితం నూకరాజు కొడుకు శ్రీను గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనపై సీతానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.