యనమలకుదురులో ఘనంగా గ్రామోత్సవం
కృష్ణా: యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం ముఖ్య అర్చకులు GRV సాగర్తో పాటు అర్చక బృందం కార్యక్రమాలను నిర్వహించగా, సంగా నరసింహారావు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు ఇచ్చారు.