గణేష్ ఉత్సవాల్లో జబర్దస్త్ ఫేమ్ సందడి

గణేష్ ఉత్సవాల్లో జబర్దస్త్ ఫేమ్ సందడి

GNTR: తెనాలి సమీపంలోని చినపరిమి గ్రామంలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో జబర్దస్త్ ఫేమ్ టేస్టీ తేజ సందడి చేశారు. ఈ గ్రామానికి చెందిన తేజ, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంలో ఆయన రూ. 2,00,116 చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు.