దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
HNK: ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెం గ్రామానికి చెందిన NSUI మండల అధ్యక్షుడు బొల్లెబోయిన మధు నానమ్మ కేతమ్మ దశదినకర్మ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు పాల్గొని, కేతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.