ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రెవెన్యూ అధికారి
కర్నూలు జిల్లాలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.