ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం

ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం

JGL: పట్టణంలోని శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో ఇవాళ స్వామివారి 5వ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రం సందర్భంగా జరిగే శ్రీనివాస పద్మావతి అలివేలు మంగమ్మల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. దేవాలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి, వేదమూర్తులైన బ్రాహ్మణులు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.