'నేటి ఇంటర్ పరీక్షకు 224మంది డుమ్మా'
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ Zoology, Economics పరీక్షకు 224 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 3409 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2878 మందికి గానూ 123 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.