VIDEO: వేంపల్లి చెరువుకు హంద్రీనీరు విడుదల: MLA
అన్నమయ్య: మదనపల్లె మండలం వేంపల్లి చెరువులోకి ఆదివారం హంద్రీ నీటిని కాలువ ద్వారా ప్రవేశపెట్టారని మదనపల్లె MLA షాజహాన్ భాష తెలిపారు. కాలువలకు అనుసంధానంగా ఉన్న అన్ని చెరువులను నింపడం జరుగుతుందని పేర్కొన్నారు. CM చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో మెండుగా వర్షాలు కురుస్తున్నాయని, రైతుల పంటలు బాగా పండాలని MLA ఆశాభావం వ్యక్తం చేశారు.