ఈనెల 16నుంచి ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవ వారోత్సవాలు
E.G: ఏపీ ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలను ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు DRO టి.సీతారామ మూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కార్యక్రమాల వివరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఉర్దూ ఫ్యాకల్టీ నస్రీన్, తదితరులు పాల్గొన్నారు.