సూరారంలో రోడ్డు భద్రతపై అవగాహన
MDK: సూరారం గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సర్పంచ్ నాగరాజు, పాలకవర్గ సభ్యులు హెల్మెట్లు ధరించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.