VIDEO: గణేష్ ఉత్సవ్ వెబ్‌సైట్ పై అవగాహన

ప్రకాశం: కొమరోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం ఎస్సై నాగరాజు గణేష్ ఉత్సవ్ వెబ్‌సైట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీ మెంబర్లను పిలిపించి అనుమతులపై వాటి వివరాలను వెల్లడించారు. వెబ్‌సైట్‌లో కమిటీ మెంబర్ల వివరాలు విగ్రహాన్ని ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తామో సమాచారం పొందుపరచాలని అన్నారు.