నార్సింగికి నేడు ఎమ్మెల్యే రాక

నార్సింగికి నేడు ఎమ్మెల్యే రాక

MDK: నార్సింగి మండల కేంద్రంలో నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించనున్నారు. మండలంలోని శేరిపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని, అనంతరం జప్తి శివనూర్‌లో 2 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేస్తారని మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగార్ల గోవర్ధన్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.