ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

జనగాం: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన రఘునాథపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కార్తీక్ (28) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పనులు దొరకకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.