మండ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కడ్రక మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో అందిస్తున్న ప్రభుత్వ సేవలను పరిశీలించారు. గ్రామ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు, రికార్డుల నిర్వహణపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.