శాకాంబరిగా మరిడమ్మ తల్లి

శాకాంబరిగా మరిడమ్మ తల్లి

కాకినాడ: పెద్దాపురం మరిడమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం మరిడమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనం ఇచ్చారు. దేవస్థానం ప్రాంగణమంతా వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని కూడా కూరగాయలు, పండ్లతో అలంకరించారు. సుమారు పదిటన్నులు కూరగాయలు, పండ్లతో అలంకరించినట్లు ఈవో విజయలక్ష్మి తెలిపారు.