సౌర విద్యుత్ ఉత్పత్తి పనులు ముమ్మరం

ADB: సౌర విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు పనులను ముమ్మరం చేసినట్లు బోథ్ ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. గురువారం బోథ్ మండల కేంద్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల కొలతలు తీసుకునే విధానాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎంపీడీఓతో పాటు MEO హుస్సేన్, MPO అతుల్ కుమార్, EC మధుకర్ తదితరులున్నారు.