CP బ్రౌన్ కేంద్రంలో ఆకట్టుకున్న 'ధారణ'
KDP: సీపీ.బ్రౌన్ 142వ వర్ధంతి సందర్భంగా మంగళవారం యోగి వేమన వర్సిటీ బ్రౌన్ కేంద్రంలో వారోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా డిగ్రీ విద్యార్థులకు రామాయణం, మహా భారతం, భాగవతాలపై 'ధారణ' పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెల్లాల వేంకటేశ్వరాచారి, కందిమళ్ళ రాజారెడ్డి, సుబ్బరాయుడు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దీనిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.