VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ (మం) నెమ్మికల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే కాంటాలు వేయాలని నిర్వాహకులను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో టార్పాలిన్ పట్టాలు, ట్యాజింగ్ మిషన్లు, సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో కాలిబర్ స్కేల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.