ఆలయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు

NZB: బోధన్ పట్టణంలోని చక్రేశ్వర ఆలయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. అత్యంత పురాతన చక్రేశ్వరాలయం ఆవిర్భావ వేడుకలను ఈ నెల 29న నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షులు హరికాంత్ చారి తెలిపారు.