మేడారం వెళ్తున్న ఆటో బోల్తా.. మహిళ మృతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి మేడారానికి వెళ్తున్న భక్తుల ఆటో టైర్ బ్లాస్ట్ కావడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడేమృతి చెందగా..మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ములుగు ఆసుపత్రికి తరలించారు. బాధితులు మహబూబాబాద్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.