రాజపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
MBNR: రాజపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల పురోగతిని ఆమె సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.