లైంగిక దాడి.. 8 మందిపై కేసు నమోదు
BPT: చీరాలకు చెందిన ఓ మహిళ బాపట్ల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడికి గురిచేశారని ఆరోపించింది. ఆమె సమర్పించిన వివరాల ఆధారంగా న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా నాయకురాలు రజనీతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు ఉపయోగించిన వీడియోల విషయమై కూడా విచారణ కొనసాగుతోందని టౌన్ సీఐ రాంబాబు సోమవారం తెలిపారు.