విశాఖ జిల్లాలో 2 కీలక పోస్టులు ఖాళీ
విశాఖలో రెగ్యులర్ అధికారులను నియమించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మధ్య వివాదం జరగ్గా.. ఇద్దరినీ సరెండర్ చేశారు. 2 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ అధికారులను నియమించలేదు. ఇంఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద పనుల విషయంలో తలదూర్చడం లేదు. తాత్కాలికమైన పనులనే చూసుకొని వెళ్లిపోతున్నారు.