కార్వేటినగరంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

CTR: కాంగ్రెస్ పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ రమేశ్ గురువారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కార్వేటినగరం అన్నూరులో నిర్వహించే సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్, కాంగ్రెస్ జిల్లా ఇన్‌ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు.