పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభలు
ASR: జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఈనెల 24 శుక్రవారం అరకులోయ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా జరపనున్నట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. మండలంలోని అన్ని పంచాయితీలలో నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారన్నారు. ఈ గ్రామసభలో ఆత్మనిర్భర్ పంచాయితీ లక్ష్యాన్ని సాధించేదిశగా చర్చలు, ప్రణాళిక తయారు చేస్తారని పేర్కొన్నారు.