ఆదివారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండటంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం ఒక్కరోజే మొత్తం 80,841 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.45 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.