VIDEO: పెట్రోల్ బంక్ వద్ద అపరిశుభ్ర వాతావరణం

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాలలోని పెట్రోల్ బంక్ వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెత్తా చెదారంతో పాటు మురుగు నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోయింది. దీంతో పెట్రోల్ బంక్‌కు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని పలువురు కోరారు.