చెక్ పోస్ట్ పరిశీలించిన MHBD ఎస్పీ
MHBD: గూడూరు మండల పరిధిలోని భూపతిపేట చెక్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద అధికారులు సిబ్బందితో ఆయన మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేయాలని, ఎటువంటి అక్రమ రవాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.