రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన అనపర్తి ఎమ్మెల్యే
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతాంగ సమస్యలపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. రైతులు, కౌలు రైతుల ఇబ్బందులు, ప్రమాదకరమైన రసాయనిక సేద్యం వల్ల వచ్చే నష్టాలు, ప్రకృతి వ్యవసాయ సాగు ప్రాధాన్యత తదితర అంశాలను వివరించారు. వీటిపై సంబంధిత శాఖామంత్రి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.