నేడు వీరభద్ర స్వామి ఆలయంలో ఉత్సవాలు
KMR: మద్నూర్‌లోని వీరభద్ర స్వామి ఆలయంలో నేటి నుంచి మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు సంగయప్ప స్వామి, శివప్ప తెలిపారు. ఈ నెల 13న పసుపు పూత కార్యక్రమం, 14న సాయంత్రం స్వామి వారి కళ్యాణోత్సవం, అన్న ప్రసాద వితరణ, 15న ఉదయం అగ్నిగుండం, ఊరేగింపు ఉత్సవం ఉంటుందని వివరించారు. వంద సంవత్సరాలుగా ఈ ఉత్సవం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.