ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం

PPM: ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని ఆ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణాజీ అన్నారు. సోమవారం స్దానిక ఆర్కే జూనియర్ కళాశాల, జనహత డిగ్రీ కళాశాలలో జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. రానున్న సమాజమంతా ఉత్తమ పౌరులతో నిండి ఉండాలన్న సంకల్పంతో జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందని కృష్ణాజీ తెలిపారు.