'ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలి'
NRML: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త ఉపకేంద్రాలు, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలు వెంటనే పంపాలని, అటవీ అనుమతులు త్వరగా పొందాలని సూచించారు. రాబోయే వేసవికి ముందుగా మరమ్మత్తులు పూర్తి చేయాలన్నారు.