ముందు ఇరాన్.. తర్వాత క్యూబా సంగతి: ట్రంప్
మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న దాని కంటే ఇరాన్ ఆపరేషన్ వేగంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా క్యూబాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ముందు ఇరాన్ పని ముగించిన తర్వాత క్యూబా సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేనన్నారు. అయితే క్యూబాను స్నేహపూర్వకంగానే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.