జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

ఎన్టీఆర్: జిల్లాలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ X ద్వారా సమాచారం అందించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.